: ఫిట్ నెస్ సెంటర్ పెట్టుకున్న భారత సీనియర్ పేసర్


జహీర్ ఖాన్... భారత క్రికెట్లో ప్రతిభావంతుడైన పేసర్ గా పేరు తెచ్చుకున్నా... ఫిట్ నెస్ సమస్యలతో దాదాపు తెరమరుగయ్యాడు. ఇక, జహీర్ కెరీర్ ముగిసినట్టేనని గతకొంతకాలంగా భారత క్రికెట్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి. ఇటీవలే ఇంగ్లండ్ టూర్ కు గాయం కారణంగా ఎంపిక కాలేదు. దీంతో అతడి కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో జహీర్ 'ప్రోస్పోర్ట్' పేరిట ఓ ఫిట్ నెస్ సెంటర్ నెలకొల్పాడు ముంబయిలో. ఇందులో ఫిజియోథెరపీ సేవలు కూడా అందిస్తారు. 'ప్రోస్పోర్ట్' ప్రారంభోత్సవం సందర్భంగా ఈ లెఫ్టార్మ్ పేసర్ మాట్లాడుతూ, ఇంగ్లండ్ టూర్ కు దూరం కావడంపై విచారం వ్యక్తం చేశాడు. ఆ పర్యటన కోసం చాలాకాలం నుంచి సన్నద్ధమయ్యానని, కానీ, గాయాలబారినపడడం మన చేతుల్లో ఉండదని తెలిపాడు. ఈ పరిణామం తననెంతో తీవ్ర అసహనానికి గురిచేసిందని చెప్పుకొచ్చాడు. మనమెంత అప్రమత్తంగా ఉన్నా, గాయాలవుతూనే ఉంటాయని అన్నాడు. కాగా, ఆగస్టు నుంచి బౌలింగ్ సాధన మొదలుపెడతానని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News