: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణ పనులు ప్రారంభం


మణిపూర్ లో చేపట్టిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈశాన్య సరిహద్దు రైల్వే నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి. ఇక్కడ నానీ సమీపంలో చేపడుతున్న ఈ వంతెన కోసం 141 మీటర్ల ఎత్తైన స్తంభాలు నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా చెప్పుకుంటున్న యూరప్ లోని బెల్ గ్రేడ్, బార్ రైల్వేలైన్ లో ఉన్న మాలా-రిజేకా వంతెన స్తంభాలు 139 మీటర్ల ఎత్తుతో ఉన్నాయని ఈశాన్య సరిహద్దు రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. ఇప్పుడు 111 కిలోమీటర్ల పొడవైన జిరిబామ్-తుపల్-ఇంపాల్ రైల్వే లైనులో భాగంగా నిర్మిస్తున్న ఈ ఎత్తైన వంతెన మణిపూర్ రాజధానిని దేశంలోని బ్రాడ్ గేజ్ లైనుకు కలిపేందుకు తోడ్పడుతుందని చెప్పారు. జిరిబామ్-తుపల్ మార్గం మొదటి దశ పనులు మార్చి 2016 నాటికి పూర్తి చేయనున్నట్లు వివరించారు.

  • Loading...

More Telugu News