: విశాఖలో ప్రారంభమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవోత్సవాలు


విశాఖ సాగర తీరంలో శ్రీ వేంకటేశ్వరుని వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో స్వామివారికి అభిషేక మహోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా శ్రీవారికి అర్చకులు తోమాల సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులతో స్టేడియం నిండిపోయింది. ఈ వేడుకల్లో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాన్ని వినిపించారు. వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. తిరుమలలో శ్రీవారికి జరిగే అన్ని రకాల సేవలూ ఈ వైభవోత్సవాల్లో నిర్వహిస్తారు. శ్రీవారి సేవలను విశాఖ వాసులు కనులారా తిలకించేందుకు వీలుగా టీటీడీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News