: హర్యానాలో 'మిస్టర్ ట్రాన్స్ ఫర్'


ఇటీవలే హర్యానా ప్రభుత్వానికి అడ్డం తిరిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కాస్నీ (55) కెరీర్ ఆసాంతం ఆసక్తికరం. ముక్కుసూటిగా వ్యవహరిస్తాడని పేరొందిన కాస్నీ కొద్దిరోజుల క్రితం వార్తల్లోకెక్కారు. సీఎం భూపిందర్ సింగ్ హుడా నియమించిన ఐదుగురు కమిషనర్లకు అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చేందుకు నిరాకరించడం ద్వారా కాస్నీ పేరు మీడియాలో మార్మోగిపోయింది. 30 ఏళ్ళ క్రితం స్టేట్ సివిల్ సర్వీసులో చేరిన ఆయనకు ఇప్పటిదాకా 45 ట్రాన్స్ ఫర్లు అయ్యాయి. 1984లో ఆయన బాధ్యతలు చేపట్టగా 2008లో గానీ ఆయనకు ఐఏఎస్ హోదా దక్కలేదు. కాస్నీ బ్యాచ్ మేట్లు ఆయన కంటే ముందే ఆ హోదా అందుకోవడం గమనార్హం. 2005లో ఆయనకు 8 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా అట్టిపెట్టింది హుడా ప్రభుత్వం. బదిలీలు, ప్రమోషన్ల కోసం రాజకీయనాయకుల చుట్టూ తిరగడానికి ఈయన బద్ధ వ్యతిరేకి. ఓసారి ఒక ఆఫీసర్ కు ప్రమోషన్ ఇవ్వాలంటూ ఓ గ్రామానికి చెందిన ప్రజలు రాజకీయనేతను కలిసి వచ్చి పని సాధించుకున్నారని, అదే తరహాలో చేయొచ్చు కదా అని అడిగితే కాస్నీ నిరాకరించారని ఓ అధికారి గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News