: చిలుకూరు అభయాంజనేయ స్వామి ఆలయంలో చోరీ
నల్గొండ జిల్లా చిలుకూరు అభయాంజనేయ స్వామి ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్వామివారి వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దొంగతనం విషయాన్ని ఈ తెల్లవారుజామున గమనించిన ఆలయ నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి గురైన వెండి ఆభరణాల విలువ రూ. లక్ష ఉంటుందని తెలిపారు.