: తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టమొచ్చినట్లు పాలిస్తే కుదరదు: కోదండరాం


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తనదైన పాత్ర పోషించిన వ్యక్తి టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రతిఫలాలు తెలంగాణ వాసులకు పూర్తి స్థాయిలో అందాలని ఆయన ఆశిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్లు పరిపాలిస్తే కుదరదని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. హైదరాబాదులోని బోడుప్పల్ లో రాపోలు సందీప్ ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన 'తెలంగాణ వలపోత' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలంతా ప్రస్తుతం నిరాశావాదంలోకి వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News