: ఏపీలో ప్రతి రైతుకి త్వరలో ఐప్యాడ్ ఇస్తాం: హైటెక్ సీఎం చంద్రబాబు


గతంలో హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే, ఆంధ్రప్రదేశ్ లో రైతులందరికీ త్వరలోనే ఐప్యాడ్ లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. నిన్న చంద్రబాబును కలవడానికి వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు ఈ విషయాన్ని చెప్పారు. భూసార పరీక్షలు, సాగుయోగ్యమైన పంటల నిర్ధారణ, మేలైన విత్తనాలు, ఎరువులు, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులకు ఉపగ్రహ సమాచారాన్ని చేరువ చేసేందుకు ప్రతి రైతుకూ ఐప్యాడ్ అందించాలని నిర్ణయించామని చంద్రబాబు రైతు సంఘాల నాయకులకు తెలియజేశారు. త్వరలోనే 'పొలం పిలిచింది' పేరుతో రైతుల కోసం ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో రైతులతో పాటు రైతు సంఘాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సదస్సుల వల్ల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులకు చాలా ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News