: ఏపీ శాసనసభ ద్వారాన్ని పగులగొట్టాడు


హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ద్వారాన్ని అశోక్ రెడ్డి అనే వ్యక్తి పగులగొట్టాడు. అసెంబ్లీ వద్ద సెక్యూరిటీ అప్రమత్తంగా లేని సమయం చూసుకుని ఇతగాడు ఈ పని చేశాడు. వెంటనే అలర్టయిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పీఎస్ కు తరలించారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అశోక్ రెడ్డి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు. అయితే, ఈ పనికి ఎందుకు పాల్పడ్డాడనే విషయం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News