: రజనీకాంత్ అల్లుడు ధనుష్ భవనం కూల్చివేత
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, సినీ నటుడు ధనుష్ కు అటవీశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న (సగం పూర్తయింది) అతని భవనాన్ని కూల్చివేశారు. కోయంబత్తూరు జిల్లా వైదేహి నీర్ విళిచ్చి అటవీప్రాంతంలో (రిజర్వ్ ఫారెస్ట్) ఈ భవన నిర్మాణం కొనసాగుతోంది. ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని... అందుకే కూల్చేశామని అటవీ అధికారులు తెలిపారు. పలు జంతువులు సంచరించే ఈ అటవీప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఉండవని... వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఈ ప్రాంతంలో నిర్మాణాలు నిషేధమని తెలిపారు. అయినా ధనుష్ భవనం నిర్మిస్తున్న స్థలం అటవీశాఖకు చెందినదే అని చెప్పారు. అనుమతులు లేని స్థలాన్ని... పైగా అటవీ భూమిని ధనుష్ కు ఎవరు అమ్మారు? ఎలా అమ్మారు? అనే విషయంపై ప్రస్తుతం అధికారులు దృష్టి పెట్టారు.