: ఢిల్లీలో తేల్చుకునేందుకు సిద్ధమైన వికలాంగులు
తమ హక్కుల కోసం నిరంతరాయంగా పోరాడుతున్న వికలాంగులు... తాడో పేడో ఢిల్లీలోనే తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. వికలాంగుల హక్కుల చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ బాట పట్టనున్నారు. ఆగస్టు 3న అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో 'ఛలో ఢిల్లీ' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వికలాంగులు పెద్ద ఎత్తున తరలిరావాలని వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు.