: ఏపీ వాహనాలు... తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే పన్ను కట్టాల్సిందే


తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాహనాలను తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారు. ఈ జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వాణిజ్య రవాణా వాహనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఇకపై తెలంగాణ రవాణాశాఖకు త్రైమాసిక పన్ను కట్టాల్సిందే. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా సర్క్యులర్ ను జారీ చేశారు. ఈ సర్క్యులర్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంట్రాక్టు, గూడ్స్ వాహనాలు, మోటార్ క్యాబ్స్, మాక్సీ క్యాబ్స్, కమర్షియల్ ట్రాక్టర్స్, ప్యాసింజర్ ఆటోరిక్షాలకు వర్తిస్తుందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. నేషనల్ పర్మిట్ ఉన్న వాహనాలతోపాటు, వ్యక్తిగత వాహనాలకు ఈ పన్ను నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.

  • Loading...

More Telugu News