: హైదరాబాద్ వస్తున్న అమిత్ షా: బీజేపీని తెలంగాణలో బలపేతం చేసేందుకు వ్యూహాలు
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమిత్ షా... తొలిసారిగా వచ్చే నెల 21 న హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అదే రోజు నిజాం కాలేజ్ లో పార్టీ ముఖ్య కార్యకర్తలతో జరిగే సభలో పాల్గొంటారు. మళ్లీ 22న పార్టీ కార్యవర్గ సమావేశానికి కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం జరిగిన రాష్ట్ర పదాధికారులు సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పర్యటనలో అమిత్ షా తెలంగాణ బీజేపీ వ్యవహారాలను సమీక్షించనున్నారు. బీజేపీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు తగిన వ్యూహాలను అమిత్ షా ఈ పర్యటనలో ఖరారు చేస్తారు.