: కొత్త ఎంపీలకు నేటి నుంచి శిక్షణ తరగతులు


లోక్ సభకు కొత్తగా ఎంపికైన ఎంపీలకు నేటి నుంచి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ రెండు రోజుల పాటు కొనసాగుతుంది. బ్యూరో ఆఫ్ పార్లమెంటరీ స్టడీస్ అండ్ ట్రైనింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ తరగతులు జరగనున్నాయి. సభా మర్యాదలు, ఎంపీ లాడ్స్ స్కీమ్, ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవహరించాల్సిన తీరు, స్టాండింగ్ కమిటీల పనితీరు తదితర అంశాలపై నూతన ఎంపీలకు అవగాహన కల్పిస్తారు. ప్రస్తుత సభలో 315 మంది కొత్త ఎంపీలు ఉన్నారు.

  • Loading...

More Telugu News