: మూడో టెస్టులో పట్టు బిగించిన ఇంగ్లండ్... కష్టాల్లో టీమ్ ఇండియా


ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. మూడో రోజు తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ అసాంతం తడబడుతూనే ఉంది. ప్రతి బ్యాట్స్ మెన్ ఇన్నింగ్స్ ను బాగానే ఆరంభించినప్పటికీ... ఆ ఆరంభాన్ని ఎవరూ సద్వినియోగం చేసుకోలేకపోయారు. రహానే (54; 113 బంతుల్లో 5 ఫోర్లు), ధోనీ (50 బ్యాటింగ్; 103 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. మూడోరోజు మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ 8 వికెట్లు కోల్పోయి 323 పరుగులు సాధించింది. ధోనీకి జతగా షమీ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. విజయ్ (35; 5 ఫోర్లు), కోహ్లీ (39; 3 ఫోర్లు), జడేజా (31; 6 ఫోర్లు), రోహిత్ (28; 3 ఫోర్లు), పుజార (24; 3 ఫోర్లు)... ఇలా భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తమ ఆరంభాల్ని భారీ స్కోర్లుగా మలుచుకోవడంలో విఫలమయ్యారు. ఇంగ్లండ్ పేసర్లు అండర్సన్ (3/52), బ్రాడ్ (3/65)లు వికెట్ల వేటలో పోటీపడ్డారు. పార్ట్ టైమ్ బౌలర్ మెయిన్ అలీకి కూడా భారత్ రెండు కీలక వికెట్లు సమర్పించుకుంది. భారత్ ఫాలో ఆన్ గండం గటెక్కాలంటే మరో 47 పరుగులు చేయాలి.

  • Loading...

More Telugu News