: కేసీఆర్ ఆదేశాలతో నేడు ఛత్తీస్ గఢ్ వెళుతున్న ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి
తెలంగాణ రాష్ట్ర ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, ట్రాన్స్ కో సీఎండీ ఎస్ఎం రిజ్వీ నేడు ఛత్తీస్ గఢ్ కు బయలుదేరుతున్నారు. ఛత్తీస్ గఢ్ లో మిగులు విద్యుత్ కొనుగోలు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వీరు బయల్దేరుతున్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి ఎంత మేర విద్యుత్ తీసుకురావచ్చు, ఎంత ధరకు విద్యుత్ అందుబాటులో ఉంది, ఇక్కడకు తీసుకురావడానికి అయ్యే ఖర్చు తదితర అంశాలపై వీరు ఆ రాష్ట్ర అధికారులతో చర్చిస్తారు. అంతా సవ్యంగా జరిగితే... ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఓ ఒప్పందానికి వస్తాయి.