: ఇంగ్లండ్ క్రికెటర్ కు ఐసీసీ వార్నింగ్


ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ... ఇప్పుడు ఓ వివాదానికి కేంద్ర బిందువు. 'గాజాను రక్షించండి... పాలస్తీనాకు విముక్తి కల్పించండి' అనే నినాదం రాసి ఉన్న ఓ రిస్టు బ్యాండును ధరించి మైదానంలోకి దిగిన అలీ ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం... ఏ ఆటగాడైనా అనుమతి లేనిదే ఇలా సందేశాలిచ్చేలా దుస్తులుగానీ, రిస్ట్ బ్యాండ్ లు కానీ ధరించరాదు. ముఖ్యంగా మతపరమైన, జాతివివక్ష, రాజకీయ పరమైన సందేశాలున్న వాటిని అస్సలు ధరించకూడదు. దీంతో, ఈ విషయంపై కన్నెర్ర చేసిన ఐసీసీ... అలీపై చర్యలు చేపట్టింది. ఇకపై ఇలాంటివి ధరించకూడదని ఆదేశించింది. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకూడదని హెచ్చరించింది. అయితే అలీ చర్యను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సమర్థించిన విషయం తెలిసిందే. కానీ, మ్యాచ్ రెఫరీ డేవిడ్ బూన్ ఈ చర్యను చాలా తీవ్రంగా పరిగణించాడు. ఇంగ్లండ్ తరఫున ఆడుతున్న మొయిన్ అలీ పాకిస్తాన్ జాతీయుడు.

  • Loading...

More Telugu News