: పసిడి 'పట్టు' పట్టారు


గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత మల్లయోధులు ఓ పట్టు పట్టారు. పతకాల పట్టికలో భారత్ ను మరోమెట్టు పైకి చేర్చారు. నిన్న (ఆరో రోజు) భారత రెజ్లర్లు ఏకంగా మూడు స్వర్ణ పతకాలు కొల్లగొట్టారు. 74 కిలోల విభాగంలో మన రెజ్లర్ సుశీల్ కుమార్ పాకిస్థాన్ రెజ్లర్ ఖమర్ ను ఫైనల్లో చిత్తుచేసి గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. మరో రెజ్లర్ అమిత్ కుమార్, మహిళా రెజ్లర్ వినేష్ కూడా స్వర్ణ పతకాలు సాధించారు. మరో రెజ్లర్ రాజీవ్ తొమర్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. మొత్తంమ్మీద భారత రెజ్లర్లు నిన్న తిరుగులేని ప్రదర్శన చేసి దేశం గర్వపడేలా చేశారు.

  • Loading...

More Telugu News