: సినారే నాకు బహుమతి తెచ్చిన గురువు: కేసీఆర్
ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సి.నారాయణ రెడ్డి తనకు గురువని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సినారే పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన 'నింగికెగిరిన చెట్టు' పుస్తకావిష్కరణ సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రబారతిలో కేసీఆర్ మాట్లాడుతూ, సినారే రాసిన 'ఎందెందు వెదికినా' పద్యంపై సమగ్రమైన విశ్లేషణ రాసి ఎంఏలో ఉండగా బహుమతి సాధించానని గుర్తు చేసుకున్నారు. సినారే రచనలు అన్ని తరాలవారిని ఆకట్టుకున్నాయని ఆయన తెలిపారు. ఆచార్య జయశంకర్, సినారే ఒకే తరానికి చెందిన వారని ఆయన పేర్కొన్నారు. ఉర్దూ మీడియంలో విద్య సాగించిన సినారే ఎంఏలో తెలుగు తీసుకుని సాహసం చేశారని ఆయన పేర్కొన్నారు. సినారే రచనలు తెలుగువారందర్నీ అలరించాయని ఆయన కొనియాడారు.