: దారి తప్పిన ఇంజనీర్లను రక్షించిన ఈ-మెయిల్


దారీతెన్నూ కానక అడవిలో గాలిపటాల్లా తిరుగుతున్న ఇంజనీర్లను ఈ మెయిల్ రక్షించింది. సాహస క్రీడలు ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కాస్త ధైర్యవంతులైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు విభిన్నత, ఆటవిడుపు, వ్యాయామం, మానసిక ఆనందం కోసం ట్రెక్కింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి అభిరుచి కలిగిన 14 మంది చెన్నైకి చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్లు కర్ణాటక హాసన్ జిల్లాలోని అడవుల్లోకి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. దట్టమైన ఆ అడవుల్లోకి వచ్చిన దారిని ఆ ఇంజనీర్లు మర్చిపోయారు. చాలా సేపు దారికోసం వెతుకులాడిన తరువాత, తాము దారి తప్పిన విషయాన్ని ఈ-మెయిల్ ద్వారా తమ మిత్రులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన మిత్రులు ఈ విషయం అటవీ శాఖ సిబ్బందికి తెలిపారు. అటవీ సిబ్బంది అడవిలో గాలించి వారిని వెతికి పట్టుకున్నారు. దీంతో వారంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News