: ఏపీలో కోటి ఎర్రచందనం మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ లో కోటి ఎర్రచందనం మొక్కలను నాటుతామని రాష్ట్ర సహాయ అటవీ సంరక్షణాధికారి రమేష్ కల్హాటీ చెప్పారు. ఎర్రచందనం మొక్కలు పెరిగేందుకు అనువుగా ఉండే వాతావరణం ఉన్న ఐదు జిల్లాల్లో కోటి మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. ఉపాధి హామీ తదితర పథకాల ద్వారా ఈ మొక్కలను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, పొదలకూరు ఎర్రచందనం గోదాములను ఆయన తనిఖీ చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 8 వేల టన్నుల ఎర్రచందనాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించనున్నట్లు ఆయన తెలిపారు.