: అక్కడ ‘అమ్మ క్యాంటీన్లు’... ఇక్కడ ‘అన్న క్యాంటీన్లు’
నిరుపేదల క్షుద్బాధను తీర్చేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నై నగరంలో ‘అమ్మ క్యాంటీన్’ల పేరిట రెండు రూపాయకే ఇడ్లీ సాంబారు, ఐదు రూపాయలకే భోజనాన్ని అందిస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ ‘అన్న క్యాంటీన్’లను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి అమ్మ క్యాంటీన్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత చెన్నై వెళ్లారు. ప్రజా పంపిణీ వ్యవస్థను సమూలంగా మార్చివేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ యోచిస్తోంది. ఇందుకోసం చౌక ధరల దుకాణాలు (రేషన్ షాపులు), రైతు బజార్ల పనితీరును అధ్యయనం చేసేందుకు మంత్రి పరిటాల సునీతను చెన్నై పంపించినట్టు తెలుస్తోంది. ఏపీలోనూ పేదల ఆకలిని తీర్చేందుకు ఎన్టీఆర్ పేరిట ‘అన్న క్యాంటీన్’లను తెరవాలని బాబు యోచిస్తున్నారు.