: జానారెడ్డి విమర్శలకు అర్థం లేదు... పొన్నాల విమర్శలు అర్థం కావు: హరీశ్ రావు


రాష్ట్ర విభజన ఇంకా పూర్తిగా జరగలేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చిక్కులను తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్ మీటింగ్ లో 43 నిర్ణయాలు ఆమోదించిన ఘనత తమదేనన్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాకుండా ‘కళ్యాణ లక్ష్మి’ అనే పథకాన్ని ప్రవేశపెట్టామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జానారెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. జానారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు బాధాకరమన్న ఆయన... పొన్నాల లక్ష్మయ్య ఏం మాట్లాడుతారో ఆయనకే సరిగా తెలియదని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని హరీష్ రావు అన్నారు. రైతులందరికీ రుణమాఫీ ప్రకటించిన ఘనత తమదేనని హరీష్ రావు చెప్పుకొచ్చారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి చిక్కులున్నా, 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీని చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News