: 6 వేల కోట్లకు ఫ్లిప్ కార్ట్ ఎంఓయూ


భారత దేశంలో అతిపెద్ద 'ఈ కామర్స్' సంస్థ ఫ్లిప్ కార్ట్ భారీగా నిధులను సమీకరించుకుంది. ఆన్ లైన్ వ్యాపార రంగంలో తలెత్తిన పోటీని తట్టుకునేందుకు కొత్త ఇన్వెస్టర్లతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఎంఓయూ కారణంగా ఫ్లిప్ కార్ట్ ఒక బిలియన్ డాలర్లను (6 వేల కోట్ల రూపాయలు) నిధిగా సమీకరించుకుంది. దీంతో ఫ్లిప్ కార్ట్ విలువ అమాంతం 7 బిలియన్ డాలర్లకు (42 వేల కోట్ల రూపాయలు) చేరుకుందని భావిస్తున్నారు. నూతన ఇన్వెస్టర్లలో టైగర్ మేనేజ్ మెంట్ అండ్ నాస్పర్, సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్, జీఐసీ, ఎక్సెల్ పార్టనర్, డీఎస్టీ గ్లోబల్, మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, సొఫినా సంస్థలు ఉన్నాయని సమాచారం. తాజాగా సమకూర్చుకున్న నిధులతో ఫ్లిప్ కార్ట్ మొబైల్ సర్వీసెస్, రీసెర్చ్ అండ్ డెవలెప్ మెంట్ విభాగాల్లో ఖర్చుచేయనుంది. కాగా, ఫ్లిప్ కార్ట్ బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తోంది.

  • Loading...

More Telugu News