: పాక్ ఇప్పటికీ భారత్ కు ఎంఎఫ్ఎన్ హోదా ఇవ్వలేదు: కేంద్రం


భారత్ తమకు అత్యంత అనుకూల దేశం (మోస్ట్ ఫేవార్డ్ నేషన్- ఎంఎఫ్ఎన్) అని దాయాది దేశం పాకిస్థాన్ ఇప్పటికీ హోదా మంజూరు చేయలేదని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంటుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు ఇచ్చిన ఓ లిఖిత పూర్వక సమాధానంలో, "భారత్, పాక్ మధ్య ఎలాంటి అధికారిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం లేదు. 1996లో పాక్ కు భారత్ ఎంఎఫ్ఎన్ హోదాను ఇచ్చింది. దానిపై ఇంతవరకు పాక్ నుంచి తిరుగు సమాధానం లేదు" అని పేర్కొన్నారు. భారత్ కు ఎంఎఫ్ఎన్ హోదా ఇస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు.

  • Loading...

More Telugu News