: పార్లమెంటు సిబ్బందిని బెంబేలెత్తించిన వింత జంతువు


అది ఏ కుక్కో, నక్కో అయితే గుర్తుపట్టేవాళ్ళేమో కానీ, ఈ జంతువును మునుపెన్నడూ చూడకపోవడంతో పార్లమెంటు సిబ్బంది హడలిపోయారట. విచిత్ర రూపు కలిగిన ఓ జంతువు పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించడంతో వారికి ఏం చేయాలో పాలుపోలేదు. వర్షం పడుతుండడంతో రక్షణ కోసం అది లోపలికి ప్రవేశించిందట. కాసేపటికి తెప్పరిల్లిన పార్లమెంటు సిబ్బంది వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ అనే స్వచ్ఛంద సంస్థకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆ సంస్థ సిబ్బంది వచ్చి ఓ టీవీ వెనక దాగిన ఆ జంతువును సురక్షితంగా పట్టుకున్నారు. దానిపేరు పామ్ సివెట్ అని, అంతరించిపోతున్న జీవజాతుల్లో ఇదీ ఒకటని వైల్డ్ లైఫ్ సిబ్బంది తెలిపారు. ఎవరికీ హాని తలపెట్టని ఈ జంతువు, ఆహారంగా క్రూర జంతువులు తినగా మిగిలిన మాంసాన్ని, ఫలాలను స్వీకరిస్తుందట. వివిర్రిడే కుటుంబానికి చెందిని దీని శాస్త్రీయనామం పారడాక్సోరస్ హెర్మాఫ్రోడైట్స్. ముంగిస, అడవిపిల్లి వంటి జంతువులను పోలి ఉంటుంది.

  • Loading...

More Telugu News