: విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఉమ్మడి అడ్మిషన్లు జరగాలి: ఉన్నత విద్యామండలి ఛైర్మన్
ఉన్నత మండలి చట్టప్రకారం అడ్మిషన్లను చేపడుతుందని ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. కౌన్సిలింగ్, అడ్మిషన్లు ఆపాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. హైదరాబాదులోని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కౌన్సెలింగ్ సజావుగా జరిగేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన చెప్పారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఉమ్మడి అడ్మిషన్లు జరగాలని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 7వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.