: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల రైతులకు శుభవార్త


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులకు ఇది శుభవార్తే. భారీ వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరింది. దీంతో, నారాయణపూర్ డ్యాంలో భారీగా చేరుతున్న వరద నీటిని సోమవారం రాత్రి దిగువకు వదిలిపెట్టారు. కృష్ణా వరదనీరు తెలంగాణ రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు బుధవారం మధ్యాహ్నానికి చేరుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మొత్తం 38 వేల క్యూసెక్కుల నీరు జూరాల డ్యాంకు చేరుతోంది. ఈ వారంలో కర్ణాటకతో పాటు ఆంధ్ర, తెలంగాణలోనూ వర్షాలు విస్తారంగా కురవడంతో రైతన్నలు ఏరువాక పనుల్లో నిమగ్నమయ్యారు.

  • Loading...

More Telugu News