: ఈ రోజైనా ఈ ఇద్దరు ‘చంద్రులు’ కలుస్తారా?


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖరరావు ఒకప్పుడు మంచి మిత్రులు... మరిప్పుడో రాజకీయ విరోధులు! ఈ ఇద్దరి మధ్య రాష్ట్ర విభజన అగాధాన్ని పెంచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య తరచూ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. విభజన జరిగి 50 రోజులవుతున్నా ఇప్పటికీ వీరిద్దరూ ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. మొన్నటికి మొన్న మహంకాళీ జాతర సందర్భంగా కాస్తలో చంద్రబాబు, కేసీఆర్ ల కలయిక తప్పిపోయింది. ఈ రోజు గవర్నర్ ఇఫ్తార్ విందులో వీరిద్దరూ మళ్లీ ఎదురుపడనున్నారు. మరిప్పుడైనా బాబు, కేసీఆర్ మాట్లాడుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా అనేక అంశాల్లో వీరిద్దరూ చర్చించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. మున్ముందు అయినా వీరిద్దరూ కలవాలని ఆశిద్దాం.

  • Loading...

More Telugu News