: ఏడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఆసుపత్రి యజమాని!
పశ్చిమ బెంగాల్ లో సహోద్యోగుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన రైల్వే ఉద్యోగిని స్ఫూర్తితో అత్యాచారానికి గురైన అబలలు ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకోగలుగుతున్నారు. తాజాగా మిడ్నాపూర్ జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రి ఉద్యోగిని తన యజమానిపై ఫిర్యాదు చేసింది. గత ఏడేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆమెను మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. అనంతరం ఆసుపత్రిలో సీసీ టీవీ పుటేజి పరిశీలించారు. అయితే అతనికి వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యం లభించలేదని వారు వెల్లడించారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.