: రూ.100 కోట్ల క్లబ్ కు... ‘కిక్’ ఎక్కింది!


ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘కిక్’ రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. షాజిద్ నడియాడ్ వాలా దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. తాజాగా ‘కిక్’ రూ.100 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్ పరిశ్రమ వర్గాల సమాచారం. సల్మాన్ సినిమా రూ.100 కోట్లు వసూలు చేయడం కొత్తేమీ కాదు... గతంలోనూ దబాంగ్, బాడీగార్డ్, రెడీ, ఏక్ థా టైగర్, దబాంగ్-2 సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరిన విషయం విదితమే. ప్రతి రంజాన్ పండుగకు సల్లూ భాయ్ సినిమా తప్పనిసరిగా ఉంటూ వస్తోంది. రంజాన్ పండుగ సల్మాన్ ఖాన్ కు కలిసివస్తోంది. ఈద్ పండుగకు విడుదలయ్యే సల్మాన్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతున్నాయి. అలాగే ఈసారి ఈద్ పండుగకు ‘కిక్’ థియేటర్లలో సందడి చేస్తోంది. గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా 5 వేల స్క్రీన్ లలో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమాకు మాతృక... తెలుగులో రవితేజ నటించిన కిక్ సినిమా. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘కిక్’... ఇప్పుడు బాలీవుడ్ లోనూ రికార్డులను షేక్ చేస్తోంది.

  • Loading...

More Telugu News