: ఎంసెట్ కౌన్సెలింగ్ యథాతథం... ఉన్నత విద్యామండలి నిర్ణయం
సంకటంగా మారిన ఎంసెట్ కౌన్సెలింగ్ పై ఉన్నత విద్యామండలి స్పష్టతకు వచ్చింది. రెండు రాష్ట్రాల్లోనూ కౌన్సెలింగ్ ను యథాతథంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావుతో మండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి సమావేశం ముగిసింది. కౌన్సెలింగ్ నిర్వహణ అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. అలాగే కౌన్సెలింగ్ కు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కోరాలని నిర్ణయించారు. కౌన్సెలింగ్ ఆలస్యమైతే విద్యా సంవత్సరంలో వెనకబడిపోయి భవిష్యత్తులో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఈ క్రమంలోనే కౌన్సెలింగ్ ను ఎప్పటిలానే జరపాలని విద్యామండలి భావిస్తోంది.