: ఫేస్ బుక్ లో వివాదాస్పద ఫోటోలు... బీ కేర్ ఫుల్
సామాజిక అనుసంధాన నెట్ వర్క్ ఫేస్ బుక్ భారతదేశంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇంటర్నెట్ వినియోగం తెలిసిన ప్రతి ఒక్కరూ ఫేస్ బుక్ లో అకౌంట్ కలిగి ఉంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ ను జాగ్రత్తగా వినియోగించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఉత్తరప్రదేశ్ లోని సహారన్ పూర్ మత ఘర్షణలకు సంబంధించిన ఫోటోలను ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాతో పోస్టు చేసిన లలిత్ కోలియా అనే యువకుడ్ని పోలీసులు ఉత్తరాఖండ్ లోని ఉద్దమ్ సింగ్ నగర్ లో అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పద భూమి వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. రెండు రోజులపాటు కర్ఫ్యూ విధించారు. ఫేస్ బుక్ లో పోస్టు పెట్టేటప్పుడు జాగ్రత్తగా మసలుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐపీ అడ్రస్ ప్రకారం అతడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.