: ప్రతి సోమవారం అరుణ్ జైట్లీని కలవండి... పార్టీ అధికార ప్రతినిధులకు మోడీ ఆదేశం


ప్రభుత్వం, బీజేపీ మధ్య సమన్వయం ఉండేలా ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనదైన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు వారంలో ప్రతి సోమవారం పార్టీ, ప్రభుత్వ అధికార ప్రతినిధులు, టీవీ ప్యానలిస్టులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలవాలని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా పార్టీ, ప్రభుత్వం మధ్య లోపించిన కమ్యూనికేషన్ ను నిరోధించడానికి, పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని, నిర్ణయాలను అధికార ప్రతినిధులు తెలిపేందుకు ఉపయోగపడుతుందని తెలుస్తోంది. తద్వారా పార్టీ నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేయవచ్చని మోడీ యోచిస్తున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News