: కొత్త పంథాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ... పోలీసుల చేతికి చిక్కారు


శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేందుకు ఈ ముఠా కొత్త పంథాను ఎన్నుకుంది. ముందుగా ట్రావెల్స్ నుంచి కార్లను అద్దెకు తీసుకుని కొన్ని రోజులు ఎర్రచందనం దుంగలను కట్ చేసి... కారు డిక్కీలో పెట్టేసి ఎంచక్కా చెన్నైకి తరలించారు. ఆ తర్వాత ఏకంగా కార్లను దొంగతనం చేయడం మొదలుపెట్టిందీ ముఠా. చోరీ చేసిన కార్లలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ వచ్చింది. కొన్నాళ్లు స్మగ్లింగ్ దందా బాగానే నడిచింది. అయితే, పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో ఈ ముఠా బండారం బట్టబయలైంది. ఈ ముఠా సభ్యుల నుంచి 3 కార్లను, రూ. 44 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఈ స్మగ్లింగ్ చేసినదెవరో తెలుసా? ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు!

  • Loading...

More Telugu News