: మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం: యశోద ఆసుపత్రి వైద్యులు


మెదక్ జిల్లా మాసాయిపేట బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి... సికింద్రాబాదు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రశాంత్, వరుణ్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా, శరత్ అనే బాలుడి పరిస్థతి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఇక ఫాతిమా, దర్శన్, హరీశ్, త్రిష, శ్రావణి, నితూష ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అభినంద్, శివకుమార్ అనే చిన్నారులను ఇవాళ డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News