: ఆగస్టులో హైదరాబాద్ రానున్న బీజేపీ చీఫ్
భారతీయ జనతా పార్టీ కొత్త అధినేత అమిత్ షా ఆగస్టు రెండోవారంలో హైదరాబాద్ నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన గ్రామస్థాయి నేతలతోనూ భేటీ కానున్నారు. అమిత్ షా పర్యటన తేదీలు మరో రెండ్రోజుల్లో ఖరారవుతాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.