: అక్బరుద్దీన్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్


వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మళ్లీ అరెస్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో అక్బర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయినా అక్బర్ హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి అక్బర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ, విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేశారు. బెయిల్ పై బయట ఉన్న నిందితులు విచారణకు హాజరు కానప్పుడు కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది. దీంతో పోలీసులు ఏ క్షణంలోనైనా సదరు నిందితుడిని అరెస్ట్ చేయడానికి వీలు కలుగుతుంది. వివాదాస్పద కేసులోనే గతంలో అరెస్టయిన అక్బర్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News