: 'మోడీ మంత్రా' పై చైనా మీడియాలో కథనం


భారత ప్రధాని నరేంద్ర మోడీపై అగ్రరాజ్యాలు సహా పలు దేశాలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఆయన పాలనా దక్షత వారిలో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మేరకు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ మోడీపై కథనం ప్రచురించింది. ముఖ్యంగా మోడీ పాలనా పగ్గాలు చేపట్టాక ప్రభుత్వ కార్యాలయాల పనితీరు విశేషంగా మెరుగుపడిందని పేర్కొంది. సిబ్బంది సమయపాలన, ఆఫీసు పరిశుభ్రత వంటి అంశాలకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపింది. కార్యాలయాల్లో మంత్రుల తనిఖీలు, ఫైళ్ళ పెండింగ్ పట్ల వారు అధికారులకు ఆదేశాలు జారీచేయడం, మంత్రులు తమ వద్దకొచ్చిన ఫైళ్ళను వెంటనే క్లియర్ చేయడం, ఆఫీసుల్లో పాత ఫర్నిచర్ స్థానే నూతన సామగ్రి అమర్చడం... వంటి మార్పులు 'మోడీ మంత్రా'కు నిదర్శనమని సదరు పత్రిక కొనియాడింది. గత ప్రభుత్వ హయాంలో బూజుపట్టిన ఫైళ్ళను సైతం తాజా క్యాబినెట్ ఆగమేఘాలపై పరిష్కరిస్తోందని పేర్కొంది.

  • Loading...

More Telugu News