: విశాఖలో దొంగనోట్ల కలకలం
విశాఖ జిల్లాలో దొంగనోట్లు కలకలం రేపాయి. జిల్లాలోని మాకవరపాలెం మండలం భీమబోయిన పాలెంలో ఉపాధి కూలీలకు ఇచ్చిన జీతాల్లో రూ.30 వేల దొంగనోట్లు పంపిణీ అయ్యాయి. దీంతో ఉపాధి కూలీలు లబోదిబో మంటున్నారు. నకిలీ నోట్ల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా... వారు పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.