: ఆదిలాబాద్ జిల్లా 'రెండో కాశ్మీర్' అంటున్న స్వామిగౌడ్
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్ నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని కుంటాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, కొమరం భీం పేరిట స్మృతివనం ఏర్పాటు చేయాలన్నారు. అలా చేసినట్టయితే ఆదిలాబాద్ జిల్లా రెండో కాశ్మీర్ గా తయారవుతుందని వ్యాఖ్యానించారు. కాశ్మీర్ తరహా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే జిల్లాలో వనరులను, అటవీ ప్రాంతాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సి ఉంటుందని స్వామిగౌడ్ తెలిపారు. కాగా, జిల్లా పర్యటన సందర్భంగా స్వామిగౌడ్ ను ఉద్యోగ సంఘాలు ఘనంగా సన్మానించాయి.