: లిబియాలో చిక్కుకుపోయిన జిల్లా వాసులు క్షేమం: కర్నూలు జిల్లా కలెక్టర్


ఉపాధి కోసం లిబియాకు వెళ్లి చిక్కుకుపోయిన కర్నూలు జిల్లా వాసులందరూ క్షేమంగా ఉన్నారని కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ్ మోహన్ తెలిపారు. అక్కడ ఓ సిమెంట్ కంపెనీలో పనిచేయడానికి రెండేళ్ల కాంట్రాక్టుపై బేతంచర్ల మండలం సిమెంట్ నగర్ కు చెందిన 100 మంది యువకులు వెళ్లారు. వీరిలో కొంతమంది గడువు ముగియగా... మరికొంత మందికి ఆగస్టు నెల వరకు పర్మిట్ ఉంది. ప్రస్తుతం లిబియాలో అంతర్యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో, స్వస్థలాలకు చేరుకునేందుకు సిమెంట్ నగర్ వాసులు విమానాశ్రయానికి చేరుకున్నారు. అదేసమయంలో విమానాశ్రయాన్ని తీవ్రవాదులు పేల్చివేయడంతో వారంతా ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం వారంతా క్షేమంగానే ఉన్నారని... సహాయక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

  • Loading...

More Telugu News