: 'యూనినార్' గిన్నిస్ రికార్డు


ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ యూనినార్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. దేశంలోని తన సర్కిళ్ళలో ఏకకాలంలో 362 రిటైల్ ఔట్ లెట్లను ప్రారంభించడం ద్వారా యూనినార్ ఈ ఘనత సాధించింది. ఇలా ఒకేరోజు, ఒకే సమయంలో ఇన్ని ఔట్ లెట్లు ప్రారంభం కావడం ప్రపంచంలో ఇదే ప్రథమమని సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాజీవ్ సేథి తెలిపారు. ఇది సమష్టి కృషి ఫలితమని, ఇందులో తమ ఉద్యోగులతో పాటు ఖాతాదారులకూ భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పశ్చిమ, తూర్పు ప్రాంతాలు, బీహార్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ సర్కిళ్ళలో యూనినార్ తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

  • Loading...

More Telugu News