: తిరుమలలో వీఐపీ దర్శనాలకు చెక్ పెట్టనున్న టీడీపీ సర్కార్
గత కొంతకాలంగా తిరుమలలో తీవ్ర విమర్శల పాలవుతున్న విఐపీ బ్రేక్ దర్శనాలకు చాలా వరకు చెక్ పడనుంది. ప్రతిరోజు వీఐపీ దర్శనాల బ్రేక్ వల్ల తిరుమలలో సామాన్యప్రజలు బాగా ఇబ్బందిపడుతున్నారన్న విమర్శల నేపథ్యంలో... శ్రీవారి భక్తులకు ఊరటనిచ్చే నిర్ణయం టీడీపీ ప్రభుత్వం తీసుకుంది. ఇకపై తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఈ విషయంలో తనపై చాలా ఒత్తిడి ఉన్నా... అమలు చేసి తీరుతామన్నారు. 300 రూపాయల దర్శనాన్ని భక్తులు ఇకపై ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని మాణిక్యాలరావు తెలిపారు. పాలనలో మరింత పారదర్శకంగా వ్యవహరించడానికి... అన్ని దేవాలయాల ఆస్తులు, ఆదాయవ్యయాలను వెబ్‌సైట్లలో పొందుపరుస్తామని ఆయన వ్యాఖ్యానించారు.