: శ్రీలంక నేవీ అదుపులో 50 మంది తమిళ మత్స్యకారులు
తమిళనాడులోని నాగపట్టణంకు చెందిన యాభై మంది మత్స్యకారులను శ్రీలంక నేవి అదుపులోకి తీసుకుంది. కొన్ని రోజుల కిందటే 25 మంది మత్స్యకారులను అరెస్టు చేసిన లంక అధికారులు వారి బోట్లను కూడా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు విడుదలయ్యేలా చూడాలంటూ ముఖ్యమంత్రి జయలలిత ప్రధానమంత్రికి లేఖ కూడా రాశారు.