: మైలారం షిర్డీసాయి మందిరంలో వెండి కిరీటం చోరీ
ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలంలోని మైలారం గ్రామంలోని షిర్డీసాయి మందిరంలో చోరీ జరిగింది. బాబా విగ్రహానికి ఉన్న వెండి కిరీటం, హుండీలోని నగదు అపహరించి తీసుకెళ్లారు. కిటీకీలోంచి ఆలయంలోకి చొరబడిన దుండగులు చోరీకి పాల్పడినట్లు ఆలయ కమిటీసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.