: గాజాకు సంఘీభావం తెలిపిన ఇంగ్లండ్ క్రికెటర్... ఐసీసీ సీరియస్


ఇజ్రాయెల్, హమాస్ తీవ్రవాద సంస్థల నడుమ నలిగిపోతున్న గాజా స్ట్రిప్ ప్రాంతానికి ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ సంఘీభావం తెలపడాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్ తో మూడో టెస్టు సందర్భంగా మొయిన్ చేతికి 'గాజా' రిస్ట్ బ్యాండ్లు కట్టుకుని బరిలో దిగడం చర్చనీయాంశం అయింది. దీంతో, ఐసీసీ ఈ ఘటనపై విచారణకు తెరదీసింది. సౌతాంప్టన్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మొయిన్ బ్యాటింగ్ కు దిగినప్పుడు టీవీల్లో ఈ బ్యాండ్లు స్పష్టంగా కనిపించాయి. ఆ రిస్ట్ బ్యాండ్లపై 'సేవ్ గాజా', 'ఫ్రీ పాలస్తీనా' అన్న నినాదాలున్నాయి. దీనిపై, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, మొయిన్ ఎలాంటి తప్పిదానికి పాల్పడ్డట్టు తాము భావించడంలేదని తెలిపారు. ఏదేమైనా, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఐసీసీయేనని అన్నారు.

  • Loading...

More Telugu News