: ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
అత్యంత విలువైన ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించడానికి పటిష్ఠ చర్యలు చేపడుతున్నా... స్మగ్లర్లు ఏదో ఒక విధంగా రవాణా చేస్తున్నారు. తాజాగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 60 కిలోల ఎర్రచందనాన్ని, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లపై పోలీసులు విచారణ ప్రారంభించారు.