: అన్ని విమానాశ్రయాల్లో హైఅలర్ట్
ఎయిర్ పోర్టులపై దాడులకు పాల్పడతామని ముంబై పోలీస్ కమిషనర్ కు ఇండియన్ ముజాహిదీన్ లేఖ రాసిన నేపథ్యంలో... దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులలో హైఅలర్ట్ ప్రకటించారు. దీనికితోడు, విమానాశ్రయాల్లోనూ, ప్రధాన నగరాలలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను పెంచారు.