: 22కు చేరిన ‘నగరం’ మృతుల సంఖ్య


గెయిల్ గ్యాస్ పైపులు లీకైన ఘటనలో తీవ్ర గాయాలపాలైన సూరిబాబు (58) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మరణించినవారి సంఖ్య 22కు చేరింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ల నుంచి గ్యాస్ లీకైన నేపథ్యంలో భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల 27న జరిగిన ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు ఇప్పటికే మరణించారు. గాయపడ్డ వారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అమలాపురం లోని కిమ్స్ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. వీరిలో సూరిబాబు మంగళవారం మరణించారు.

  • Loading...

More Telugu News