: అసలే అత్యాచారం.. ఆపై ఆసుపత్రిలో అర్ధనగ్నంగా అవమానం


ఆమె అభం శుభం తెలియని మానసిక వికలాంగురాలు. అత్యాచారానికి బలైంది... ఆసుపత్రిలో అంతకు మించిన అవమానానికీ గురైంది. ఆ వివరాల్లోకి వెళితే, కర్ణాటక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెలితే... మైసూరు జిల్లాలోని వరుణ ప్రాంతంలో మానసిక వికలాంగురాలైన బాలికపై పక్కింట్లో ఉండే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అత్యాచారం జరిగిందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అత్యాచారం జరగడంతో భయపడిన ఆమె వైద్యపరీక్షలు చేయించుకునేందుకు నిరాకరించింది. తరువాత నచ్చజెప్పడంతో పరీక్షలకు సిద్ధమయింది. పరీక్షల పేరిట ఆమెను కొన్ని గంటలపాటు ఆసుపత్రి బెడ్ మీద అర్ధనగ్నంగా ఉంచేశారు వైద్యులు. ఈ విషయం బయటకు పొక్కడంతో కర్ణాటక రాష్ట్ర మహిళాకమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యులను పిలిపించి విచారించింది. ఆసుపత్రిలో సరైన వైద్యసదుపాయాలు లేక ఆమెను అంతసేపు అలా ఉంచాల్సివచ్చిందని వైద్యులు వివరణ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై తదుపరి చర్యలు మహిళా కమిషన్ వెల్లడించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News